డిజిపీ ఎదుట లొంగిపోయిన ఆలూరి ఉషా రాణి


హైదరాబాద్‌ : మావోయిస్టు అగ్రనేత ఆలూరి ఉషా రాణి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆలూరి ఉషా రాణి . నిషేదిత సిపిఐ మావోయిస్టు పార్టీ డివిజనల్‌ కమిటీ సభ్యురాలు ఆలూరి ఉషారాణి అలియాస్‌ విజయక్క అలియాస్‌ పోచక్క, భాను దీదీ శనివారం రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎం మహేందర్‌ రెడ్డి ఎదుట లంగిపోయారు. ఆమె సీపీఐ మావోయిస్ట్‌ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ ఉత్తర సబ్‌ జోనల్‌ బ్యూరో సభ్యురాలు. ఉషా రాణి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో అనేక హింసాత్మక సంఘటనలలో పాల్గంది. ఆమె వెల్లడిరచిన వివరాల ప్రకారం రెండు రాష్ట్రాల్లో మొత్తం 14 నేరాలలో పాల్గంది, ఇందులో భద్రతా దళాలపై ఐదు సార్లు దాడులు, పోలీసులతో మూడుసార్లు ఎదురుకాల్పులు, బ్లాస్టింగ్‌ కేసులు ఉన్నాయి. భవనాలు పబ్లిక్‌, ప్రైవేట్‌, ఒక అపహరణ కేసుతోపాటు రెండు దాడి కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా, తెనాలికి చెందిన ఆలూరి ఉషా రాణి స్వతాహగ తండ్రి మావోయిస్టు పార్టీలో పనిచేస్తుండటంతో మావోయిస్టు భావజాలానికి ఆకర్షితురాలై డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే పార్టీలో చేరింది.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading