కాంగ్రెస్‌ గొడ్డలిపై గుడ్డ కప్పి తిరుగుతోంది

కార్రగెస్‌ గొడ్డలిపై గుడ్డ కప్పి తిరుగుతోంది
కెసిఆర్‌ మాట శిలాక్షరం
బలుపు రాజకీయాలకు బుద్ది చెప్పాలి
సత్తుపల్లి సత్తా చూపించాలి
నెత్తుల మధ్య కాదు పార్టీల మధ్య పోరాటం

కెసిఆర్‌ మాట శిలాక్షరం

బలుపు రాజకీయాలకు బుద్ది చెప్పాలి

సత్తుపల్లి సత్తా చూపించాలి

నెత్తుల మధ్య కాదు పార్టీల మధ్య పోరాటం


సత్తుపల్లి :
దళిత బంధును దేశానికి పరిచయం చేసిన మొగోడిని నేనే అని సిఎం కెసిఆర్‌ అన్నారు. సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య ఆధ్వంర్యంలో బుధవారం ప్రజా ఆశిర్వాద సభ నిర్వహించారు. ఈసందర్భంగా సిఎం కెసిఆర్‌ మాట్లాడారు. గాయపడి బాధపడిన మహా కవి గుఱ్ఱం జాషువా కావ్యాలు రాశారని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలు దళితులను ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని, దళితుల అరచేతిలో బెల్లం పెట్టి మోచేయి నాకించాయన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దళిత చైతన్య జ్యోతి కార్యక్రమాలు చేపట్టాము. అదే స్పూర్తితో దళిత బందు పథకానికి ప్రణాళికలు తయారు చేశాము. కానీ నోట్ల రద్దు, కరోనా కారణంతో పథకం అమలులో ఆలస్యం అయ్యింది. దళితులు అధికంగా ఉన్న నాగులు జిల్లాలో దళిత బందును అమలు చేశామన్నారు. జిల్లాలో మధిరాలోని చింతకాని, సత్తుపల్లి నియోజకవర్గాలను సైతం చేర్చామన్నారు. ఎన్నికల తరువాత 100శాతం పథకాన్ని అమలు చేసి తీరుతాము.
గొడ్డలిపైన గుడ్డ కప్పి కాంగ్రెస్‌ తిరుగుతోంది

రాష్ట్ర విడిపోతే తెలంగాణ కటిక చీకటి అవుతుందని కర్రపెట్టి చూపించారని, కానీ నేడు తెలంగాణలో నిరంతరం విద్యుత్‌ వెలుగులు జిమ్ముతుంటే అక్కడ మాత్రం చీకట్లు కముమ్ముకున్నాయని తెలిపారు. డబుల్‌ రోడ్‌ అంటే తెలంగాణ వచ్చిందని, సింగల్‌ రోడ్‌ వస్తే పక్క రాష్ట్రం అన్నంత తేడా ఉందన్నారు. విచక్షనతో ప్రజలు అభివృద్ధికి ఓటేయ్యాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ బుజంపై ఉన్న గొడ్డలి మీద గుడ్డ కప్పి తిరుగుతుందని ప్రజలు ఆదమరిచి ఓటేస్తే ప్రజా సంక్షేమం మీద వేటు వేసేందుకు సిద్దంగా ఉందని హెచ్చరించారు. పొలాలలో నీళ్ళ కోసం అసెంబ్లీలో పంచాయతీలు జరిగాయన్నారు. నీళ్ళ కోసం పెట్టిన మోటర్లను అధికారులు ఎత్తుకెల్లారని ఆవేదన చెందారు. బిఆర్‌ఎస్‌ పాలనలో 24 గంటల నాణ్యమైన కరెంటు అందిస్తున్నామని, రైతు బంధు, రైతు భీమా అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే తెలంగాణలో మళ్ళీ దళారీల రాజ్యం వస్తుందని, ఎవడో సన్యాసి రాసిస్తే అజ్ఞాని తీసేస్తా అనడం విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్‌ గాంధీ కూడా ధరణిని రద్దు చేస్తామనడం దురదృష్ట కరం అన్నారు. రాహుల్‌ గాంధీకి ఎద్దు ఎరుకలే వ్యవసాయం తెలియదన్నారు. మోదీ ప్రభుత్వానికి ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకుందని, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటికరణ చేస్తున్నారని చెప్పారు. విద్యుత్‌ వ్యవస్థను కూడా ప్రైవేటీకరించేందుకు సిద్దపడ్డారని, మోదీని వ్యతిరేకించి నందుకే కక్షగట్టి రైతుల మోటర్లకు మీటర్లు పెట్టమన్నారు. ప్రభుత్వానికి రూ 25వేల కోట్ల నష్ట వాటిల్లిందని, కానీ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేసిందన్నారు.
ఖమ్మం జిల్లా బంగారు తునక
సాగర్‌ కాలువ నుండి మామిడి చెట్లకు నీళ్ళు తీసకుంటే మోటర్లు కోసి కాల్వల పడేస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారని గుర్తు చేశారు. సీతారామ ప్రాజెక్టు పనులు 70 శాతం పనులు పూర్తి అయ్యాయి. కెసిఆర్‌ మాట శిలా శాసనం అని, ఖమ్మం జిల్లాకు కరువు దరిచేరనివ్వమని హామీ ఇచ్చారు. పాత ఖమ్మం జిల్లా బంగారు తునక తాయరు చేస్తామని స్పష్టం చేశారు. సుజాతనగర్‌ నియోజకవర్గ నీళ్ళు లేక రైతులు కన్నీళ్ళు పెట్టుకున్నారు అని, నాడు రైతుల కన్నీళ్ళు తుడవడం చేతకానివారు నేడు గోదావరి జలాలతో కాళ్ళు కడుగుతాను అనడం విడ్డూరంగా ఉందని చురకలు అంటించారు. ఎజెండా లేకుండా జెండాలు ఒక్కటవుతున్నాయని, చిల్లర మాటలు ప్రజలు నమ్మొదన్నారు. సత్తుపల్లి చైతన్యవంతమైన, ఆలోచనా శక్తి ఉన్నటువంటి ప్రాంతమని, పార్టీల చరిత్ర, నాయకుల అనుభవంతో పాటు కార్య దక్షత ఎంటో ప్రజలు తెలుసుకుని ప్రజలు ఓటు వేయాలన్నారు. నాగులు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ నాయకుడిగా కాకుండా ఓ కార్యకర్తలా నిత్యం ప్రజలకోసం పోరాటం చేసే వ్యక్తి సండ్ర అని అన్నారు. వచ్చేది బిఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అని, మీరు ఆశిర్వదించండి ప్రభుత్వం ఎర్పడగానే సీతారామ ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టి నీటి విడుదలకు స్విచ్‌ నొక్కుతామన్నారు. సండ్రను గెలిపించి గేటు దాటించి సత్తుపల్లి సత్తా చూపాలన్నారు.
సండ్ర సత్తా ఉన్నోడు
సత్తుపల్లి బిఆర్‌ఎస్‌ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య సత్తా ఉన్నోడని, సత్తుపల్లిలో భారీ మెజారీటీతో గెలుస్తాడు అనడానికి ఈ సభ నిదర్శం అన్నారు. నిత్యం ప్రజలకోసం అవిరామంగా పనిచేస్తున్న ప్రజా నాయకుడు సండ్ర అని, సత్తుపల్లి పైల్వాన్‌ సండ్రను అసెంబ్లీకి పంపాలని సిఎం కెసిఆర్‌ అన్నారు. ప్రాజెక్టులు కట్టాలనే కలలు కూడా కననోడు నేడు జబ్బలు చరుస్తున్నారని ఎద్దేవ చేశారు. బిఆర్‌ఎస్‌ అభ్యర్థులను అసెంబ్ల్రీ గేటు దాట నీయం అంటూ మరో నాయకుడు గడియారాలచ్చి గారడి మాటలు చెబుతున్నారని గడియారంలోని ఫోటో కావాలో ఆత్మగౌరవంతో కడుపు నిండా అన్నం కావావో జిల్లా ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. నాలు పైసలు జేలులో కనపడగానే కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని, డబ్బుతో కూడిన దురహంకారంతో ఏదైనా చేస్తే చెల్లుతుందనే ఇద్దరు దగుల్బాజీ నాయకుటు మీ ముందుకు వస్తున్నారు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హితము పలికారు. కూరగాయల్లో పుచ్చులను ఏరేసినట్లు ఉన్మాదపు నాయకులను రాజకీయల నుండి ఏరేయాలని లేని పక్షంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ మీజీ స్పీమధుసుధనాచారి, ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, రాములు నాయక్‌, ఎమ్మెల్సీ ప్రబోత్తమ రెడ్డి డిసిఎంఎస్‌ గ్రంథాలయ చైర్మన్‌ ఉమామహెశ్వరరావు తదితరులు పాల్గొన్నారు .

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading