రుధిర క్షేత్రానికి రేణుకా చౌదరి


ఎమ్మెల్యే, ఎంపిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి
రూ 50 లక్షలు ఎక్గ్స్రేషియా ప్రకటించాలి
కేసు నమోదు చేసిన పోలీసులు


ఖమ్మం :
కాంగ్రెస్‌ నేతలను చూస్తే రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందని, పర్యటనలను అడ్డుకునేందకు 144 సెక్షన్‌ పెడుతున్నారు అని కాంగ్రెస్‌ మాజీ పార్లమెంటు సభ్యురాలు రేణుక చౌదరి ఆగ్రహించారు. ప్రమాదంలో గాయపడిన హెడ్‌ కానిస్టేబుల్‌కు కుటుంబానికి రూ 50లక్షలు ఎక్గ్స్రేషియా ఇవ్వాలని, క్షతగాత్రులు పూర్తిగా నయం అయ్యేవరకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. భాణాసంచా కాల్చేందుకు అనుమతి ఎవరు ఇచ్చారని, ఈ ఘటనకు బాధ్యులైన ఎంపి, ఎమ్మేల్యేపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. కారేపల్లి మండలం చీమలపాడులో అధికార పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. రుధిర క్షేత్రంగా మారిన చిమలపాడు గ్రామానికి మృతుల కుటుంబాలను పరామర్శించేందకు వెళ్ళుతున్న ఆమెను కామేపల్లి పోలీస్‌ స్టేషన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలకు, రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్‌గా పేరు ఉన్న రేణుకా చౌదరి తన సహజశైలిలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ ప్రజా రక్షకులే ప్రభుత్వ అడుగులకు మడుగులత్తుతూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేయడం ఏంటని ప్రశ్నించారు. అధికార మదంతో అణచివేత ధోరణితో నియంత పాలన కొనసాగిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. కెసిఆర్‌ సిఎం సీటు కోసం కోట్లు పెట్టి సంతలో పశువుల్లా నేతలను కొనుగోలు చేశారని ఎద్దేవ చేశారు. విధినిర్వహణలో గాయపడి కాలును పోగొట్టుకున్న పోలీసు సిబ్బందికి ప్రభుత్వం ఏమి చేసిందని పోలీసులను ఎదురు ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారాన్ని అడ్డు పెట్టుకుని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని అయినా భయపడేది లేదన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్త కొడుకు చనిపోతే కుటుంబాన్ని పరామర్శించే స్వేచ్చ తెలంగాణలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ బాదితులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఖమ్మం ఇల్లందు ప్రధాన రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోతంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీనితో పోలీసులకు మధ్య తోపులాటతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈఘటనతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading