అన్నదానం పవిత్రమైన ఓ గొప్ప సంస్కృతి
- కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగేంద్ర త్రివేది

కొత్తగూడెం: అన్నదానం పవిత్రమైన ఒక గొప్ప సంస్కృతి మున్సిపాలిటీ పరిధిలోని రైటర్ బస్తీ కాళికమాత దేవాలయం వద్ద బ్రదర్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక మండపంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగేంద్ర త్రివేది పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి అన్నదానం ఒక పవిత్రమైన అర్పణగా భావించడం భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న ఒక గొప్ప సంస్కృతి అన్నారు.
ఇలా అన్నదానం ప్రాముఖ్యత గూర్చి వివరించారు. అన్ని దానాలోకెలా అన్నదానం మిన్న అని అన్నారు. ఉత్సవ కమిటీ ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారన్నారు. ముందుగా కాలికామాత అమ్మవారిని దార్చిం చి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శేఖర్, బండి భాస్కర్, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.